మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు
ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సులో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. నాయక్ ఆదివారం తెలిపారు. బీ.కాం(జనరల్), బీ.కాం(సీఏ), బీ.యస్సీ మేథ్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులలో సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 17వ తేదీ నుంచి అర్హత ధ్రువపత్రాలతో కళాశాల ఆఫీసు నందు హజరుకావాలని సూచించారు.