గ్రామ సర్పంచ్‌గా వైద్య విద్యార్థిని విజయం
WNP: పెబ్బేరు మండలంలో మూడవ విడత గ్రామ పంచాయతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వై-శాగాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి K.N నిఖిత తన ప్రత్యర్థి మీద 548 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. తనని గెలిపించిన వై-శాగాపూర్ గ్రామ ప్రజలందరికీ, సహకరించిన MLA మేఘారెడ్డికి, పెబ్బేరు మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.