బండారు దత్తాత్రేయకు గన్నవరంలో ఘన స్వాగతం
కృష్ణా: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర నేతలు కానూరి శేషు మాదవి, నాదెండ్ల మోహన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం బండారు దత్తాత్రేయ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.