అగ్నిమాపక పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
NZB: బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 20 వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ విఠల్ పాల్గొన్నారు.