వైసీపీ సోషల్ మీడియా సెక్రటరీగా వేణుగోపాల్ రెడ్డి
సత్యసాయి: వైసీపీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్ర సెక్రటరీగా బీ.వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన హిందూపురం వైసీపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ సీనియర్ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి పదవిని అప్పగించినందుకు వేణురెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.