కోనేరు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి
SKLM: టెక్కలిలోని పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కోనేరు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. అనంతరం టెక్కలిలోని శ్రీశ్రీశ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులను పరిశీలించారు.