రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
NRPT: గత నెలలో మరికల్ మండల కేంద్రంలో లారీ, బైక్ ఢీ కొన్నాయి. రోడ్డు ప్రమాదంలో మాధవరం గ్రామానికి చెందిన రాజు (40) తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాదులోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.