దైవాన్ని స్మరించడంపై మాధవీలత మరో పోస్ట్
TG: దైవాన్ని స్మరించడంపై BJP నేత మాధవీలత మరోసారి Xలో పోస్ట్ చేశారు. సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయ సమయాలలో దైవాన్ని స్మరించాలని హిందూ ధర్మం బోధిస్తుందని తెలిపారు. భక్తి అనేది క్షణికమైనది కాదని.. అది ఒక జీవన విధానమంటూ పేర్కొన్నారు. కాగా నిన్న ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రేయర్ రూమ్‌లో దుర్గా సూక్తం పఠించిన మాధవీలత వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.