రైలు నుంచి పడి యువకుడి దుర్మరణం

రైలు నుంచి పడి యువకుడి దుర్మరణం

TPT: వేపగుంట స్టేషన్ వద్ద రైలులో నుంచి పడి యువకుడి దుర్మరణం చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు కథనం మేరకు.. వేపగుంట ఆర్ఎస్ ప్లాట్‌ఫాం నెంబర్ 3 వద్ద కదులుతున్న రైలు నుంచి పడిపోయినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని సమాచారం తెలిసిన వారు సమీప రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.