రూ.50 లక్షల చెల్లింపుతో వివాదం పరిష్కారం?

రూ.50 లక్షల చెల్లింపుతో వివాదం పరిష్కారం?

అనుమతి లేకుండా తన పాటలను మైత్రీ మూవీ మేకర్స్ వారి సినిమాల్లో ఉపయోగించిందని మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తమ చిత్రాలైన 'డ్యూడ్', 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో ఇళయరాజా పాటలను వాడినందుకు గాను, ఆయనకు రూ.50లక్షలు చెల్లించడానికి మైత్రీ మూవీస్ ఒప్పుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.