'వ్యర్థాల పునర్వినియోగానికి ముందుకు రండి'
VSP: నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను పునర్వినియోగం చేయడం ద్వారా పరిశుభ్రతతో పాటు ఆర్థిక లాభం పొందవచ్చని జీవీఎంసీ అదనపు కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. మంగళవారం పెందుర్తి 89వ వార్డు యల్లపువానిపాలెంలో వేస్ట్ టు వండర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇంటి వ్యర్థాలతో ఎకోబ్రిక్స్, సేంద్రియ ఎరువు తయారీపై ప్రజలు ముందుకు రావాలని సూచించారు.