మత్తు పదార్థాల వినియోగం అరికట్టడమే లక్ష్యం: SP
ADB: జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ చర్యలు కొనసాగిస్తుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ప్రాంగణంలో గల డవ్ డి-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించి అందుతున్న చికిత్స వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో DSP జీవన్ రెడ్డి, సీఐ నాగరాజు, స్వామి సిబ్బంది, తదితరులు ఉన్నారు.