VIDEO: ప్రత్తిపాడులో పొంగిన వాగు.. రాకపోకలకు అంతరాయం

VIDEO: ప్రత్తిపాడులో పొంగిన వాగు.. రాకపోకలకు అంతరాయం

GNTR: ప్రత్తిపాడు మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా వాగులు పొంగిపొర్లడంతో ప్రత్తిపాడు-పర్చూరు రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నిలిచిన నీటిలో వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.