మద్దిలేటి స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే కోట్ల పూజలు
NDL: బేతంచెర్ల మండలంలోని ఆర్.ఎస్. రంగాపురం శివారులో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానాన్ని గురువారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.