నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ATP: గుంతకల్లు ఆలూరు రోడ్డు, ఆదర్శనగర్ సబ్ స్టేషన్ల పరిధిలోని డి2 సెక్షన్ 11 కెవి లైన్ నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ADE నాగేంద్ర, ఏఈ రఘునాథ్ శుక్రవారం తెలిపారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేనున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.