రాళ్ళ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
CTR: నగరి రూరల్ మండలం మేలపట్టు దళిత వాడలో సీతాలమ్మ శక్తి రాళ్ళ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ తీర్ధప్రసాదాలు అందుకున్నారు. ఈ వేడుకకు అనేక మంది భక్తులు వచ్చారు.