VIDEO: కాలువ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్

VIDEO: కాలువ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్

BPT: అద్దంకి మండలం కలవకూరు గ్రామంలోని సచివాలయం వద్ద మురుగునీరు నిల్వ ఉండి స్థానికులకు తీవ్ర సమస్యగా మారింది. కాలువ నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే నీరు రోజుల తరబడి నిలిచి దుర్వాసన, దోమల పెరుగుదలకు కారణమవుతోంది. వెంటనే కాలువ నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.