మేయర్ రాజీనామా.. అవిశ్వాస తీర్మానం లేనట్లే
AP: నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 18న ఆవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుండగా.. శనివారం రాత్రి మీడియా సాక్షిగా మేయర్ పదవిని వీడుతున్నట్లు స్రవంతి ప్రకటించారు. ఇవాళ తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్‌కు అందించనున్నట్లు చెప్పారు. పదవికి రాజీనామా చేసినా ప్రజలకు చేరువగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు.