VIDEO: సాగర్ నగర్‌లో నాగుపాము హల్చల్

VIDEO: సాగర్ నగర్‌లో నాగుపాము హల్చల్

VSP: సాగర్ నగర్ పరిధిలోని ఓ ఇంటి ఆవరణలో గురువారం నాగుపాము హల్చల్ చేసింది. దీంతో చుట్టు పక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న స్నేక్స్ క్యాచర్, సొసైటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ అక్కడకి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పామును అడవిలో వదిలేస్తామన్నారు. పాములు కనబడితే చంపవద్దని, సమాచారం ఇవ్వాలని కోరారు.