బోయపేటలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
సత్యసాయి: హిందూపురం పట్టణం 20 వార్డ్ బోయపేటలో వైసీపీ నాయకులు గురువారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. 20 వార్డ్ వైసీపీ ఇంఛార్జ్ శంకరయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు వైద్యం అందకుండా పోతుందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి సంతకాల సేకరిస్తున్నట్లు తెలిపారు.