VIDEO: స్టంట్స్ చేసిన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు

VIDEO: స్టంట్స్ చేసిన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు

HYD: ఈనెల 7న ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై స్కూటీలతో స్టంట్స్ చేస్తూ వాహనదారులను యువకులు ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ మరోవైపు వీడియోలు తీసుకుంటూ యువకులు రెచ్చిపోగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్టంట్స్ చేసిన ముగ్గురు మైనర్లతో పాటు మరో ముగ్గురికి బహదూర్ పుర పోలీసులు ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించారు.