గ్రానెట్ ఓవర్ లోడ్.. వాహనం సీజ్
SRCL: గ్రానైట్ స్లాబ్స్ ఓవర్ లోడుతో వెళుతున్న వాహనాన్ని సిరిసిల్ల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ పృథ్వీరాజ్ వర్మ సీజ్ చేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ఆదేశానుసారం ఓవర్ లోడ్ వాహనాలపై దృష్టి సారించి జిల్లాలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి వద్ద గ్రానైట్ ఓవర్ లోడ్‌తో వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేసి సీజ్ చేశారు.