ముస్లింలకు రంజాన్ తోఫాల పంపిణీ

ముస్లింలకు రంజాన్ తోఫాల పంపిణీ

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో ఉన్న ముస్లిం సోదరులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు రంజాన్ తోఫాలను అందజేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్ తోఫాలను వారు శుక్రవారం అందజేశారు. రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ఉన్నారు.