రేపు విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపక పోస్టులకు ముఖాముఖి
KDP: యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్సెస్ విభాగ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి బుధవారం ఉదయం 11 గంటలకు ముఖాముఖి నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ, ఎంపీఈ ఉత్తీర్ణత పొంది 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.in చూడాలని సూచించారు.