ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
SDPT: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. ములుగు మండలం క్షీరసాగర్‌లో గురువారం ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం అన్నాసాగర్‌లో నూతనంగా నిర్మించనున్న సీసీ రహదారి పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.