గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య కిట్లు పంపిణీ

గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య కిట్లు పంపిణీ

MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ ఆరోగ్య కిట్లు పంపిణీ చేశారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం తన వంతుగా సహకారం అందించేందుకు గాను నియోజకవర్గ వ్యాప్తంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, మందుల కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.