నాగార్జున సాగర్ కు వరద ఉధృతి

నాగార్జున సాగర్ కు వరద ఉధృతి

NLG: నాగార్జునసాగర్ కు వరద నీరు భారీగా చేరుతోంది. 14 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి, 1,09,438 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,72,800 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,46,036 క్యూసెక్కులుగా ఉంది. జలాశయంలో నీటి మట్టం 587.30 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 305.68TMC లు ఉంది.