'ఆకివీడులో 693 ఎకరాలు నీటమునిగాయి'

W.G: ఆకివీడు మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 693 ఎకరాల్లో వరి పంట నీటమునిగిందని అగ్రికల్చర్ ఏడీఏ జీవన్ ప్రసాద్ తెలిపారు. పంటకాలువలు, మురుగు కాలువలు పొంగిపొర్లుతుండటంతో ఈ నష్టం జరిగిందన్నారు. మొత్తం 3,500 ఎకరాల్లో సాగవుతున్న పంటకు సంబంధించి, నీటమునిగిన వివరాలను ప్రభుత్వానికి నివేదించామని ఆయన వివరించారు.