పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలి: AITUC
NDL: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ హాస్టళ్లలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని AITUC జిల్లా నాయకుడు రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో సర్వశిక్ష అభియాన్ అడిషనల్ స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ దేవానంద రెడ్డికి ఈ మేరకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.