జుజ్జూరులో నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమం

జుజ్జూరులో నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమం

NTR: వీరులపాడు మండలం జుజ్జూరు, అల్లూరు గ్రామాలలో మంగళవారం ‘నో హెల్మెట్–నో ఎంట్రీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అభిమన్యు నాయక్ పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.