అంగరంగ వైభవంగా "అంగారక చతుర్థి" వేడుకలు

PDPL: శ్రీ గణనాథుని పూజిస్తే అంతా శుభం జరుగుతుంది. అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా మంగళవారం గణనాథుని ఆలయాలు భక్తులతో పండుగ వాతావరణం నెలకొంటుంది. దైనందిన జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ సంకటహర చతుర్థి దీక్షతో తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. కొత్తగా చతుర్థి దీక్ష తీసుకునేవారు అంగారక చతుర్థి రోజున దీక్ష తీసుకోవడం ఎంతో శ్రేయష్కరం.