మహిళల ఆర్థిక ప్రగతే ప్రభుత్వ లక్ష్యం: జిల్లా కలెక్టర్

మహిళల ఆర్థిక ప్రగతే ప్రభుత్వ లక్ష్యం: జిల్లా కలెక్టర్

వరంగల్:  మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ పెంబర్తి గ్రామ మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు కుడుతున్న విద్యార్థుల యూనిఫామ్ దుస్తులను శుక్రవారం సాయంత్రం  పరిశీలించినట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే దుస్తులు కుట్టే బాధ్యతను మహిళలకే  అప్పగించినట్లు, దింతో ఆర్ధిక ప్రగతి సాదిస్తారని పేర్కొన్నారు.