సింగపూర్ చేరుకున్న మంత్రి బీసీ
NDL: వారం రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సహచర మంత్రులతో కలిసి సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు అసోసియేషన్ సభ్యులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతీయతను, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న సంఘ సభ్యులను మంత్రి బీసీ ప్రత్యేకంగా అభినందించారు.