'వినాయక నవరాత్రి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి'

SRD: వినాయక నవరాత్రి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెరువులు కలుషితం కాకుండా మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని చెప్పారు. పోలీసు అధికారుల సూచనలు నిర్వాహకులు పాటించాలని పేర్కొన్నారు.