20.670 కిలోల గంజాయి పట్టివేత

20.670 కిలోల గంజాయి పట్టివేత

SKLM: ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయితో పట్టుపడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరి బ్యాగ్లను పరిశీలించారు. అందులో 20 .670 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చిన్నం నాయుడు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.