VIDEO: విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న కేబుల్స్ తొలగింపు

WGL: రాష్ట్రంలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా విద్యుత్ తీగలు తగిలి పలువురు ప్రాణాలు కోల్పోవడంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. బుధవారం వర్ధన్నపేటలో విద్యుత్ అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది ప్రమాదకరంగా ఉన్న ఇంటర్నెట్, టీవీ కేబుళ్లను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కేబుళ్లను వెంటనే తొలగించుకోవాలని, లేకపోతే వాటిని కట్ చేస్తామని హెచ్చరించారు.