అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం స్వాధీనం

NLR: కోవూరు మండలంలోని సాలుచింతల వద్ద అక్రమంగా తరలిస్తున్న 150 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని కోవూరు పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకొని, సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. సివిల్ సప్లై అధికారి బాలకోటమ్మ, ఎస్సై రంగనాథ్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని, వాహనంలోని రేషన్ బియ్యాన్ని పరిశీలించారు.