ఎంపీ నాగరాజును కలిసిన మాజీ సర్పంచ్
కర్నూలులో ఎంపీ నాగరాజును ఆస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ మల్లికార్జున రెడ్డి సోమవారం కలిశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, జల జీవన్ మిషన్ కింద పదింటికి తాగునీరు, మిర్రర్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయాలని కోరారు. గ్రామంలోని పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు.