ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

ATP: బొమ్మనహాళ్(మం) ఉద్దేహాల్‌లో తిరుమల(23) ఉరేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బళ్లారిలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ.. మధ్యలోనే ఆపేశాడు. దీంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన తిరుమల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.