ప్రైవేట్ ఆసుపత్రిని తనిఖీ చేసిన DMHO
భద్రాద్రికొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ తుకారం రాథోడ్ గురువారం పాల్వంచలోని శ్రీ విజయ నర్సింగ్ హోమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలో రోగులకు అందించే సేవలు, రక్తపరీక్షల ధరల జాబితా, డాక్టర్ల పేర్లను రిసెప్షన్ వద్ద స్పష్టంగా ఉంచాలని, గదులను శుభ్రంగా ఉంచాలని సూచించారు.