VIDEO: ఉదయం నుంచి మోగుతున్న ఎస్బీఐ ఏటీఎం అలారం
AKP: నర్సీపట్నం కృష్ణ బజార్ సెంటర్లో గల ఎస్బీఐ ఏటీఎం అలారం ఉదయం నుంచి అదే పనిగా మోగుతుంది. అలారంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎస్బీఐ ఏటీఎం వద్దకు వచ్చిన ఖాతాదారులు కంగారుపడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి అదే పనిగా అలారం మోగుతుందని స్థానికులు తెలిపారు. బ్యాంకుకు రెండో శనివారం సెలవు కావడంతో అధికారులు అందుబాటులో లేరు.