'త్వరలో అమెరికాలో ఆర్థికమాంద్యం'

అమెరికాలో ఉద్యోగాల సృష్టిపై ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త మార్క్ జాండీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం USలో హెల్త్ కేర్, ఆతిథ్య రంగాల్లోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని.. మిగిలిన రంగాల్లో ఉద్యోగాల సృష్టి సున్నాకు పడిపోయే పరిస్థితి ఉందన్నారు. దీనిని అధిగమించకపోతే ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని హెచ్చరించారు. ట్రంప్ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సృష్టికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.