జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తా: శ్రీనివాస్
MHBD: ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ (TWJA) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గుగులోత్ శ్రీనివాస్ నాయక్‌ను TWJA MHBD జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. ఇవాళ MHBD పట్టణంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసును శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టుల హక్కులు, వృత్తి భద్రత కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.