విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
SDPT: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన కోహెడ మండలం నారాయణపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టయ్య ఉపాధికోసం మండలంలో కట్టెలతో బొగ్గు తయారు చేసి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. గ్రామ శివారులోని కాలువ పక్కన మట్టిగుట్టపై ఎక్కి పిట్టలను వేటాడే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ప్రమాదశాత్తు మృతి చెందినట్ల గ్రామస్థులు తెలిపారు.