డిగ్రీ లేకపోయినా ఉద్యోగం ఇస్తాం: జోహో
జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సూపర్ ఆఫర్ ఇచ్చారు. డిగ్రీలు లేకపోయినా.. నైపుణ్యం ఉంటే తమ సంస్థలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయొద్దంటూ కోరారు. పలు దేశాల్లో విద్యార్థులు డిగ్రీలు వదిలి ఉద్యోగాలు ఎంచుకుంటున్నారని ఉదహరించారు. తనతో పని చేస్తున్న టీమ్ సభ్యుల సగటు వయసు 19 ఏళ్లు మాత్రమేనని వెల్లడించారు.