జిల్లాలో ఆరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం
BHNG: జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఆరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయ బావుట ఎగరవేసిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువైందన్నారు.