పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు

KRNL: కోసిగిలోని సాయిబాబా నగర్ కాలనీలో ఓ పిచ్చి కుక్క కరవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం బదినేహాల్ మారెప్ప, గోవిందమ్మ, ఈరన్నను పిచ్చికుక్క వెంటపడి దాడి చేసి కరిచింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోసిగిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పంచాయతీ సిబ్బంది వీటిని అటవీ శాఖకు అప్పగించాలని స్థానికులు కోరుతున్నారు.