జానుని పెళ్లి చేసుకుంటున్నా: సింగర్

TG: ఫోక్ డ్యాన్సర్ జాను లిరీని తాను పెళ్లి చేసుకోనున్నట్లు సింగర్ దిలీప్ దేవ్‌గణ్ తెలిపాడు. 'మేమిద్దరం ఇష్టపడ్డాం. ఏ తప్పు చేయలేదు. మా పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. నేను, జాను కలిసి జీవించాలని అనుకుంటున్నాం. ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎదుర్కొంటాం. మాకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు' అంటూ ఓ వీడియో షేర్ చేశాడు.