నేడు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

KDP: మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సోమిశెట్టి మనోహర్ బాబు తెలిపారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5:30 గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.