బాణసంచా పేలుడు ఘటన.. మరొకరు మృతి

బాణసంచా పేలుడు ఘటన.. మరొకరు మృతి

కాకినాడ: వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ లోవరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. కాగా వేట్లపాలెంలోని 'సూర్య శ్రీ ఫైర్ వర్క్స్' అనే బాణసంచా తయారీ యూనిట్ జరిగిన పేలుడు ఘటనలో ఇప్పటికే 23 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 24కు చేరింది.